రెండు చోట్ల పోటీ ప్రజా ధనం వృధా చేయడమే: కేసీఆర్‌పై MP బండి ఫైర్

కేసీఆర్ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, బీఆర్ఎస్ అంటే బంధువులు రాబంధువుల సమితి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.

Update: 2023-08-22 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, బీఆర్ఎస్ అంటే బంధువులు రాబంధువుల సమితి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు ఇవ్వడం, కోరుట్ల టికెట్ విద్యాసాగర్ రావు తనయుడి ఇవ్వడంతో కేసీఆర్ పరివార్ వాది రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

కోరుట్ల టికెట్ వ్యవహారం కుటుంబానికి సంబంధించిందని కేసీఆర్ చెప్పడాన్ని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్విట్టర్‌కే పరిమితమయ్యారని కేసీఆరే బహిరంగంగా నిరూపించారని ఎద్దేవా చేశారు. తన గెలుపుపై నమ్మకం ఉన్న సీఎం రెండు స్థానాల్లో పోటీ చేసి మరొక చోట ఉప ఎన్నికలను ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమే అని మండిపడ్డారు.

నిజామాబాద్‌లో తన కూతురు పట్టు కోల్పోకుండా చూసుకోవడం కోసమే కామారెడ్డిలో కేసీఆర్ విఫలయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే కవిత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల పేరు నిరసనలు చేసిందని ఆరోపించారు. దుర్గం చిన్నయ్య, వనమా వెంకటేశ్వరరావు లాంటి వారికి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీలో 40 మంది మహిళా అభ్యర్థులు లేరా అని నిలదీశారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..