అమిత్‌ షాతో MP Arvind భేటీ.. కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసిన అర్వింద్...

Update: 2022-12-21 11:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసిన అర్వింద్... తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా నెలకొన్న పరిస్థితుల గురించి అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, పార్టీలో చేరికల గురించి చర్చించారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను కూడా అమిత్‌షాకు దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కాగా, నిన్న ప్రధాని మోడీతో అర్వింద్ భేటీ అయిన విషయం తెలిసిందే. తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని... రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ప్రధానితో చర్చించామని ఆయన చెప్పారు.

Tags:    

Similar News