దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు ఆనంద్ కన్వెన్షన్‌లో వాటాలున్నాయంటూ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా ఆనంద్ కన్వెన్షన్‌ని నిర్మించారని, అందులో హరీశ్‌కు కూడా వాటాలున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రజలను హరీశ్ అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే హైడ్రా హిమాయత్ సాగర్ జలశయంలోని నిర్మాణాలను కూల్చి వేసే పనిలో బిజీగా ఉంది. జల మండలి, రెవెన్య అధికారులు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాతలతోపాటు అక్రమంగా నిర్మించిన సాధారణ ప్రజల ఇళ్లు కూడా కూలగొట్టే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.