జర్నలిస్టులపై దాడి కేసు: తెలంగాణ హైకోర్టుకు మోహన్ బాబు
సినీ నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు..
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్ బాబు(Movie actor Mohan Babu) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. జర్నలిస్టులపై దాడి సంబంధించిన కేసులో తనకు ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. కాగా మూడు రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫ్యామిలీ వివాదం, కేసుల నేపథ్యంలో న్యూస్ కవర్ చేసేందుకు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లిన కొందరు జర్నలిస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ, లోగోలు లాక్కుని దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మోహన్ బాబును అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరగడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.