హైడ్రాకు మరిన్ని పవర్స్.. చట్టబద్ధతపై ప్రశ్నించేవారికి ఆర్డినెన్స్‌తో చెక్

హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌)కు ఫుల్ పవర్స్ వచ్చాయి.

Update: 2024-10-16 15:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌)కు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రా(Hydraa) చట్టబద్ధతపై ప్రశ్నించేవారికి ఆర్డినెన్స్‌తో చెక్ పెట్టారు. జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్డినెన్స్‌కు కొనసాగింపుగా జీహెచ్ఎంసీ(GHMC) చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఓఆర్ఆర్, హైడ్రా పరిధిలో మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారాలను బదాలయించింది. దీంతో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కలు, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయి. ఫలితంగా ఇక నుంచి నోటీసులు జారీ చేయడం, మౌఖిక ఆదేశాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చేయడానికి, సీజ్ చేయడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయని కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) తెలిపారు.


Similar News