Monkey : కొండగట్టు అంజన్న ఆలయంలో కోతి వింత చేష్ట
కోతి(Monkey) చేష్టలు ఒక్కోసారి జనాలకు తిప్పలు పెడుతున్న ఘటనలు తరుచూ చూస్తుంటాం. ఓ కోతి సెల్ ఫోన్ గూర్చి తెలుసుకోవాలనుకుందో ఏమోగాని ఆలయానికి వచ్చిన భక్తుడి సెల్ ఫోన్ ఎత్తికెళ్లి ముప్పుతిప్పలు పెట్టింది.
దిశ, వెబ్ డెస్క్ : కోతి(Monkey) చేష్టలు ఒక్కోసారి జనాలకు తిప్పలు పెడుతున్న ఘటనలు తరుచూ చూస్తుంటాం. ఓ కోతి సెల్ ఫోన్ గూర్చి తెలుసుకోవాలనుకుందో ఏమోగాని ఆలయానికి వచ్చిన భక్తుడి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి ముప్పుతిప్పలు పెట్టింది. అది కూడా అంజనేయుడు కొలువున్న ప్రఖ్యాత కొండగట్టు అంజన్న ఆలయం (Kondagattu Anjanna Temple)లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తినుబండారాలు ఉన్నాయనుకుని ఓ భక్తుడి బ్యాగ్ తో పాటు సెల్ ఫోన్ తీసుకెళ్లి ఆలయ గోపురంపైకి ఎక్కింది వానరం.
తన బ్యాగ్, ఫోన్ తిరిగి తీసుకోవడం కోసం కోతికి ఆ భక్తుడు పులిహోర ప్యాకెట్, అరటిపండు సమర్పించుకున్నప్పటికి బ్యాగ్ వదిలేసిన కోతి..సెల్ ఫోన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టింది. చేసేది లేక ఆ భక్తుడు తన ఫోన్ కోసం ఆలయం గోపురం పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోతులు ఎంత హనుమాన్ స్వరూపమైనా వాటితో జర జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.