Monkey Pox: గాంధీ, ఫీవర్ ఆసుపత్రులలో మంకీ పాక్స్ వార్డులు

హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో మంకీ పాక్స్ వార్డులు సిద్ధమయ్యాయి.

Update: 2024-08-20 15:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో మంకీ పాక్స్ వార్డులు సిద్ధమయ్యాయి. కరోనా తరహాలోనే ప్రత్యేక వార్డులు రెడీ చేశారు. గతంలో కరోనా ట్రీట్‌మెంట్‌కు వినియోగించిన వార్డులను ఇప్పుడు మంకీ పాక్స్ వార్డులుగా మార్చారు. ఒక్కో వార్డులో 30 మంది పేషెంట్లకు చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి బెడ్‌కు వెంటిలేటర్లను అమర్చారు. దీంతో పాటు సాధారణ లక్షణాలు కలిగిన పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఐసోలేషన్ వార్డులను కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో వార్డులో యాభై మంది పేషెంట్లకు వైద్యం అందించవచ్చని డాక్టర్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోనూ వార్డులు సిద్ధమవుతున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్‌తో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లకు కసరత్తు చేస్తుంది.

Tags:    

Similar News