Mohan Babu : మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 19కి వాయిదా
టాలీవుడ్ సీనియర్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు(Mohan Babu) ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు(High Court) ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు(Mohan Babu) ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు(High Court) ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో మోహన్ బాబు అభ్యర్ధించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.