Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం, 8 మందికి గాయాలు

హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన మండల పరిధిలోని ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2025-01-10 01:39 GMT

దిశ, చివ్వెంల: హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన మండల పరిధిలోని ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలను ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఓ లారీని, బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ రవి ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News