రాష్ట్ర పర్యటనకు ముందు మోడీ వరుస ట్వీట్లు!
సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటన ముంగిట్లో మోడీ ట్వీట్లు ఆసక్తిని రేపుతున్నాయి. వరుసగా తెలంగాణ అంశాలపై స్పందిస్తున్న తీరు ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో ఇంట్రెస్టింగ్ అవుతున్నాయి. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు పెడుతున్న ట్వీట్లకు ప్రధాని స్పందిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని ఏప్రిల్ 8వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ పై మోడీ శుక్రవారం స్పందించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆత్మగౌరవం అని అభివర్ణించారు. ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ప్రాంతాల మధ్య అనుసందానతకు పర్యాయపదంగా మారిందన్నారు. సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రారంభించబోయే రైలు పర్యటకానికి, ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేష ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడింపజేస్తుందని మోడీ ట్వీట్ చేశారు.
సికింద్రాబాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్ మెంట్ పనుల ప్రారంభోత్సవంపై ప్రధాని స్పందిస్తూ మౌళిక సదుపాలయ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టు ద్వారా అసంఖ్యాకమైన ప్రజానికానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతకు ముందు గురువారం కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంపై చేసిన ట్వీట్ పై కూడా స్పందించారు. తెలంగాణలో పర్యటనకు ముందు మోడీ చేస్తున్న వరుస ట్వీట్లు తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న ఫోకస్ ఏంటో అర్థం అవుతుందని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.