మోడీ అమిత్ షా కుట్రలతో పాలన సాగిస్తున్నారు : బోయినపల్లి వినోద్ కుమార్

మోదీ తెలంగాణను గందరగోళపర్చాలని చూస్తున్నారన్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

Update: 2023-04-07 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోదీ తెలంగాణను గందరగోళపర్చాలని చూస్తున్నారన్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రలో భాగంగా బీజేపీ అగ్రనేత బి.ఎల్.సంతోష్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి అస్థిరపర్చాలని చూశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహాయం చేయడం లేదన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం తెలంగాణ రాష్ట్ర హక్కు అని తెలిపారు. నాడు వాజ్ పాయ్ ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలిపోయింది.

అయినా వాజ్ పాయ్ ఒక్క ఓటును కొనలేదని విలువలను పాటించారని గుర్తు చేశారు. నేడు మోడీ,అమిత్ షా కుట్రలతో బీజేపీని నడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన జాతీయ రహదారులను ఇవ్వమని అడిగితే కేంద్రం చేతులు ఎత్తేసిందన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితె వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని కడుతున్నారని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే దేశంలోనే ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుందన్నారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేంద్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణ సమస్యలపై నలుగురు బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా మాట్లాడారా అని మండి పడ్డారు. పేపర్ లీక్ కుట్రలకు బీజేపీ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు. మోడీ ప్రోటోకాల్ పాటించలేదు..అందుకే ప్రధాని కార్యక్రమాలకు సీఎం వెళ్లడం లేదన్నారు. 

Tags:    

Similar News