ఓటర్‌కు ‘సెల్’ కష్టాలు.. ఓటు వేయకుండానే వెనుదిరుగుతోన్న ఓటర్స్..!
ఉత్సాహంగా ఓటు వేయాలనుకున్నవారికి మొబైల్ ఫోన్‌తో కష్టాలు వచ్చిపడ్డాయి. పోలింగ్ కేంద్రం లోపలికి ఫోన్‌తో వెళ్ళకూడదంటూ ఎలక్షన్ కమిషన్ నిబంధన విధించింది. సిబ్బందితో
దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్సాహంగా ఓటు వేయాలనుకున్నవారికి మొబైల్ ఫోన్‌తో కష్టాలు వచ్చిపడ్డాయి. పోలింగ్ కేంద్రం లోపలికి ఫోన్‌తో వెళ్ళకూడదంటూ ఎలక్షన్ కమిషన్ నిబంధన విధించింది. సిబ్బందితో సహా ఎవ్వరికీ హాల్ లోపల మొబైల్ ఫోన్‌ను వాడే వెసులుబాటు లేదు. ఓటర్లు కూడా వారి వెంట మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. గేటు దగ్గరే సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసి పంపిస్తారు. ఒంటరిగా వెళ్ళే ఓటర్లకు ఈ కష్టాలు ఎక్కువ. ఫోన్‌తో లోపలికి ఎంట్రీ లేకపోవడంతో దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయడానికి ప్రత్యేక కౌంటర్, మెకానిజం లేకపోవడంతో సింగిల్‌గా వెళ్ళే ఓటర్లకు సమస్యగా మారింది. పోలింగ్ స్టాఫ్ సైతం ఫోన్లను తీసుకోడానికి పర్మిషన్ లేకపోవడంతో ‘సారీ’తో సరిపెట్టేస్తున్నారు.
ఎంట్రీ దగ్గరే సెక్యూరిటీ ఆపేస్తుండడంతో దాన్ని లోపలకు తీసుకెళ్ళలేక బైట పెట్టడానికి వెసులుబాటులేక రిటన్ వెళ్ళిపోతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితిని అర్థం చేసుకునే సెక్యూరిటీ ఫోన్‌ను దగ్గర ఉంచుకోడానికి అంగీకరిస్తున్నా మరికొన్ని చోట్ల మాత్రం ఇలాంటి హెల్పింగ్ పరిస్థితి లేదు. ఇద్దరు, ముగ్గురు ఓటర్లు కలిసి వెళ్తే వారిలో వారు అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం ఉన్నా ఒంటరిగా వెళ్ళేవారికే ఇబ్బందులు వస్తున్నాయి. వాటికి పరిష్కారం లేదు. పరిచయం లేని వ్యక్తికి ఫోన్ ఇవ్వడానికి చాలా మంది సిద్ధపడడంలేదు. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటు వేయాలనే ఉత్సాహంతో వచ్చినా చివరకు ఈ సమస్య కారణంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు.
కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రం సెక్యూరిటీ సిబ్బందే పరిస్థితిని అర్థం చేసుకుని పురుషులైనట్లయితే సైలెంట్ మోడ్‌లో ఉంచి ప్యాంట్ జేబులో పెట్టుకుని వెళ్ళేలా సహకరిస్తున్నారు. లేడీస్ విషయంలో మాత్రం హ్యాండ్ బ్యాగ్, పర్స్ లాంటివాటిలో పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీఐపీల విషయంలో ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో వారి వెంటే మొబైల్ ఫోన్లను తీసుకెళ్తున్నా సెక్యూరిటీ పెద్దగా అభ్యంతరం చెప్పడంలేదు. మొబైల్ ఫోన్‌పై ఆంక్షలు విధించడంతో సింగిల్‌గా వెళ్లే ఓటర్లకు ఇలాంటి చిక్కులు వస్తున్నాయి.