MLC RESULT : మొదలైన కౌంటింగ్ ప్రాసెస్..

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రాసెస్ మొదలయ్యింది.

Update: 2024-06-05 06:50 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రాసెస్ మొదలయ్యింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52మంది బరిలో ఉన్నారు. అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు ఉన్నారు. మే నెల 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓట్లు 4,63,389 ఓట్లకు గాను 605 పోలింగ్ స్టేషన్లలో 3,36,013ఓట్లు పొలయ్యాయి. ఈ ఓట్లు లెక్కించడానికి 2800మంది అధికారులు,144సెక్షన్ అధికారులను నియమించారు. ప్రతి 25 ఓట్లకు ఒక బండిల్‌గా కట్టనున్నారు.

అయితే గంట క్రితమే బ్యాలెట్ పేపర్లు బండిల్ కట్టే ప్రాసెస్ మొదలు పెట్టారు. దాదాపు మధ్యాహ్నం 2గంటల వరకు బండిల్స్ కట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు కష్టమేనని తెలుస్తోంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు నాయక్, బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కొదండరామ్ , ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు.అయితే అపుడు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల రెండో ప్రాధాన్యత ఓట్ల వల్ల ఈసారి కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాతనే విజయం ఎవరిని వరిస్తుందో చెప్పగలం.


Similar News