MLC Mahender Reddy: నేడు మండలి చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి
తెలంగాణ శాసనమండలి (Telangana Legislative Council) చీఫ్ విప్‌గా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy)ని నియమిస్తున్నట్లు అక్టోబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి (Telangana Legislative Council) చీఫ్ విప్‌గా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy)ని నియమిస్తున్నట్లు అక్టోబర్ 4న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇవాళ ఉదయం 10.30కి శాసనమండలిలోని తన ఛాంబర్‌లో చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు ప్రోటోకాల్ (Protocol) అధికారులు మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను కూడా కేటాయించారు.