ఇది CBI కస్టడీ కాదు BJP కస్టడీ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
సీబీఐ అధికారులపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సోమవారం సీబీఐ కస్టడీ ముగియడంతో ఆమెను మరోసారి కోర్టు ఎదుట హాజరుపరిచారు.
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ అధికారులపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సోమవారం సీబీఐ కస్టడీ ముగియడంతో ఆమెను మరోసారి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలనే లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు. కొత్త ప్రశ్నలు ఏవీ అధికారులు అడగటం లేదని చెప్పారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్‌ల మీద షాక్ తగులుతున్నాయి. ఆమె జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈనెల 23 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. దీంతో ఆమెని పోలీసులు తీహార్ జైలుకి తరలించారు.
Read More: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్.. ఈనెల 23 వరకు కస్టడీ విధింపు