తీహార్ జైలు అధికారులపై కవిత సీరియస్.. కోర్టులో పిటిషన్

తీహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2024-03-28 14:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తీహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, పెన్నులు, బెడ్‌షీట్స్, పేపర్లు తెప్పించుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పించగా.. జైలు అధికారులు మాత్రం అనుమతించడం లేదని కోర్టు మెట్లెక్కారు. వెంటనే ఇంటి భోజనం సహా మిగతా వెసులుబాట్లు కల్పించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. కాగా, 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె రిమాండ్ కొనసాగనుంది.

అయితే, హైబీపీ కారణంగా జైలులో కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు కోర్టు అంగీకరించిది. ఇంటి భోజనంతో పాటు.. మెడిసిన్స్, పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు.. ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తాజాగా.. ఈ సౌకర్యాలు జైలు అధికారులు తనకు కల్పించడం లేదని మరోసారి కవిత కోర్టును ఆశ్రయించింది. కవిత పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఎల్లుండి విచారిస్తామని పేర్కొంది.

Also Read..

బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులు లేవు 

Tags:    

Similar News