తిహార్ జైలు నుంచి MLC కవిత విడుదల.. ఆ ఇద్దరిని హత్తుకొని భావోద్వేగం

ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల అయ్యారు. మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు రాగానే.. స్వాగతం పలకడానికి సిద్ధంగా భర్త, కుమారుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

Update: 2024-08-27 15:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల అయ్యారు. మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు రాగానే.. స్వాగతం పలకడానికి సిద్ధంగా భర్త, కుమారుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారిద్దరిని హత్తుకున్నారు. మరోవైపు తిహార్ జైలు వద్ద బాణాసంచా పేల్చి బీఆర్ఎస్ శ్రేణులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా కవిత అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటికే నేను మొండిదాన్ని.. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు. నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. 18 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నన్ను ఇబ్బంది పెట్టిన అందరూ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. నన్ను, నా కుటుంబాన్ని వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. నేను భయపడే రకం కాదు.. పోరాడే మనిషిని. ఇక నుంచి తగ్గేదే లేదు. ఇంకా గట్టిగా పనిచేస్తా. ఇలాంటి కష్ట సమయంలో నాకు, మా కుటుంబానికి, పార్టీకి అండగా నిలిచిన అందరికీ ధన్యావాదాలు’ అని ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీలో మీడియాతో బుధవారం మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు ప్రయాణం కానున్నారు. ఆమెకు బెయిల్ లభించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది.

Read More..

T Congress : ఇదేం న్యాయం కేసీఆర్? న్యాయం గెలిచిందా? కవిత బెయిల్‌పై టీ కాంగ్రెస్ ప్రశ్నలు 


Similar News