HYD: తొలిసారి సెక్రటేరియట్‌కు ఎమ్మెల్సీ కవిత!

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Update: 2023-06-02 06:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. అయితే సెక్రటేరియట్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు కావడం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి కొత్త సెక్రటేరియట్‌లోకి కవిత రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో జరిగిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

దేశానికి రోల్ మోడల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలా ఈ కార్యక్రమం జరిగించినప్పటికీ ఇటువైపు కన్నెత్తి చూడని కవిత అనూహ్యంగా దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ప్రత్యక్షం కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాశంగా మారింది. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఉత్సవాల పేరుతో కేసీఆర్ నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

Tags:    

Similar News