చరిత్ర సృష్టించాం.. MLC కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన

బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచబోయే రిజర్వేషన్లను సత్వరమే అమలు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Update: 2025-03-17 16:03 GMT
చరిత్ర సృష్టించాం.. MLC కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచబోయే రిజర్వేషన్లను సత్వరమే అమలు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాకవులు, కళాకారుల వేదిక ఆవిర్భావ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులు పెట్టడం తెలంగాణ జాగృతి సాధించిన విజయమని తెలిపారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే తీవ్ర అన్యాయం జరుగుతుందని తొలి నుంచీ తాము వాదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ కలిపి చరిత్ర సృష్టించాయని తెలిపారు.

గొంతులేని వర్గాలకు గొంతునివ్వడమే నిజమైన ప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయానికి తమ సంస్థ ఎప్పుడూ కృషి చేస్తున్నదని చెప్పారు. సామాజిక తెలంగాణ వైపు మన ప్రయాణం కొనసాగించాలన్నారు. బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వంతో రెండు వేర్వేరు బిల్లులు పెట్టించడం కేవలం తొలి అడుగు మాత్రమేనని, తదుపరి ప్రభుత్వం ఏ రకరంగా చట్టాలను అమలు చేస్తున్నదో నిశితంగా గమనించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కళాకారులు గళమెత్తాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News