KCRను కాపాడటం ఎవరితరం కాదు.. MLC జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-31 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కేసీఆర్ ను సేవ్ చేయాలని చేస్తోందని అందుకే సీబీఐ ఎంక్వైరీ కోరుతోందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ను కాపాడటం ఎవరితరం కాదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.


Similar News