‘పేపర్ వర్క్ లేకుండా ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తారు?’.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
పేపర్ వర్క్, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫార్ములా వన్‌కు ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ వర్క్, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫార్ములా వన్‌కు ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. మంత్రిగా ఉండి ఈ విధంగా చేయొచ్చా? అని మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. డ్రగ్స్ పై స్పందించని కేటీఆర్, ఫార్ములా వన్ పై మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. అరెస్టు అవుతానని కేటీఆర్ భయపడుతున్నారని మండిపడ్డారు. ఫార్ములా వన్ లో ప్రొసీజర్స్ పాటించలేదన్నారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తే వంద శాతం జైలుకు పంపుతామన్నారు. ఎవిడెన్స్ ఆధారంగా లోపలేస్తామన్నారు. తప్పు చేయకపోతే ఏ విధంగా ఫార్ములా వన్ను ఓ కంపెనీకి కట్టపెట్టారని ప్రశ్నించారు. లోపాయికారి ఒప్పందాలతోనే జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ లింగం బైకాని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.