Palvai Harish: ఏడాదైనా మంత్రివర్గ విస్తరణ లేదు.. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాదైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదని, దీంతో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే(Sirpur MLA) పాల్వాయి హరీశ్(Palvai Harish) విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడి ఏడాదైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదని, దీంతో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే(Sirpur MLA) పాల్వాయి హరీశ్(Palvai Harish) విమర్శలు చేశారు. సికింద్రాబాద్(Secunderabad)లో గురువారం నిర్వహించిన సంస్థాగత ఎన్నికల కార్యశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏ ఒక్క మంత్రి ప్రాతినిధ్యం వహించడంలేదని, మంత్రివర్గ విస్తరణ లేక పాలన కుంటుపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థత పాలన వల్లే మంత్రివర్గ విస్తరణ జరగడం లేదా? అనే అనుమానాలను హరీశ్ వ్యక్తంచేశారు. సమస్యలు ఎవరితో చెప్పాలో అర్థం కావడంలేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ ఫారెస్ట్(Adilabad Forest)లో మాఫియా కొనసాగుతోందని, అదేంటని అడిగితే క్రిమినల్ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదని, తక్షణమే మంత్రివర్గ విస్తరణ జరగాలని ముఖ్యమంత్రిని ఆయన డిమాండ్ చేశారు.