భారీ ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.

Update: 2023-10-22 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ర్యాలీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కార్యాలయానికి వచ్చారు. ఒక మతాన్న కించపర్చేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనను గతంలో బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎన్నికల తరుణంలో ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బీజేపీ ఇవాళ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా నేడు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో గోషామహల్ నుంచి మరోసారి రాజాసింగ్‌కు అవకాశం దక్కింది.

సస్పెన్షన్ ఎత్తివేయడం, సీటు కేటాయించిన నేపథ్యంలో ఎట్టకేలకు రాజాసింగ్ చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. చాలారోజుల తర్వాత కార్యాలయంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉందని రాజాసింగ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.


Similar News