MLA Raja Singh: అపవిత్రం చేసినోళ్లే తిరుమలకు వెళ్తా అనడం ఏంటి.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది.

Update: 2024-09-26 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే ఈ వివాదంపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రేపు రాత్రి తిరుమల చేరుకుని రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అదేవిధంగా శనివారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు.

తిరుమల ఆలయ నిర్వహణను చూసే టీటీడీ బోర్డు (TTD Board) ఎంతో పవిత్రమైందని తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం అవ్వడం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ తమ భాధను సైతం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. నమ్మకం లేనప్పుడు కొందరు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలంటూ జగన్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. ఆలయ సంప్రదాయాలను అపవిత్రం చేసిన వాళ్లే మళ్లీ తిరుమలకు వెళ్తానంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని.. ఇది ఎంత వరకు సరైందో చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.  


Similar News