ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: MLA పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా వేస్తున్నట్లు సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రోహిత్ రెడ్డి గతంలో హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఈడీ కౌంటర్ పై వాదనలకు గడువు కావాలని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. కాగా ఈ కేసులో రోహిత్ రెడ్డి గతంలో సంచలన ఆరోపణలు చేశారు.
నిందితుడు నందకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ పేరుతో తనను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈడీ అధికారులపై రోహిత్ ఆరోపణలు చేశారు. బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించింది. ఎమ్మెల్యేల బేరసారాల అంశంపై ఫిర్యాదు చేసిన తనపైనే అధికారులు విచారిచడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. తనకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.