BREAKING: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో BRS ఎమ్మెల్యే

బీఆర్ఎస్ నేత, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారానికి ఎండ్ కార్డు పడింది. గత వారం రోజులుగా నెలకొన్న

Update: 2024-07-15 14:12 GMT
BREAKING: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో BRS ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారానికి ఎండ్ కార్డు పడింది. గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికీ చేరారు. శనివారం జాయినింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి వెళ్లిపోయిన మహిపాల్ రెడ్డి.. ఇవాళ (సోమవారం) ఎట్టకేలకు అధికార పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ రెడ్డి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ సైతం తిరిగి సొంత గూటికీ చేరుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. మహిపాల్ రెడ్డి, అనిల్ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ పార్టీలోకి స్వాగతించారు. వీరితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుండి వలసలు ప్రారంభం కావడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జంపింగ్‌తో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఎమ్మె్ల్యేల సంఖ్య 10కి చేరింది. గూడెం కంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యేల వలసల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగగా.. ఇప్పుడు ఏకంగా ఆయన సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే పార్టీ మారడం గులాబీ వర్గాల్లో గుబులు రేపుతోంది. 



 


Tags:    

Similar News