బడ్జెట్‌పై స్పందన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సీరియస్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. రైతులకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాంతాడంత చెప్పారు.. బడ్జెట్‌లో మాత్రం చెంచాడంత కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. పంటల బీమా, పంటల బోనస్, రైతు భరోసాకు నిధులు ఎలా ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పగా ప్రకటించి ఇప్పటివరకు స్పందించడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమని హరీష్ రావు చెప్పారు. రుణమాఫీకి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు.
పంటల బోనస్‌కు రూ.15 వేల కోట్లు అవసరమని కానీ, బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదని మండిపడ్డారు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి ఇప్పుడు ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపైనా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సభ హుందాతనాన్ని తగ్గించేలా సీఎం మాట్లాడారని హరీష్ రావు అన్నారు. సీఎంను కలిసేందుకు బీఆర్ఎస్ సభ్యులు వస్తే ఆ పార్టీ ఆందోళనకు గురవుతోందని చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానానికే రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదని విమర్శించారు. అందుకే ప్రధానిని కలిసేందుకు వెళ్లినప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంట పంపించారన్నారు.