మేడిగడ్డను సందర్శించిన మంత్రి ఉత్తమ్.. మరమ్మతు పనులపై ఆరా!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టుల డ్యామేజీ నేపధ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలలో మరమ్మత్తు పనులు జరుగున్న విషయం తెలిసిందే. ఈ పనులను జూన్ చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీంతో ఈ మరమ్మత్తు పనులను పరిశీలించేందుకు ఉత్తమ్ అక్కడికి వెళ్లారు. ఈ మేరకు అక్కడి అధికారులతో కలిసి బ్యారేజీని విజిట్ చేసిన మంత్రి.. పనులపై ఆరా తీశారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ కానున్నారని తెలుస్తోంది. వీరితో బ్యారేజీల మరమ్మతులు, రక్షణ చర్యలపై సమీక్షనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్ బృందం బుధవారం నుంచి మేడగడ్డలో పర్యటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా కాళేశ్వరం విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ నేటి నుంచి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించనున్నారు.