పెట్రోల్, డీజిల్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్
ట్రాన్స్‌పోర్టు రంగం సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ట్రాన్స్‌పోర్టు రంగం సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ట్రక్కుల యజమానులు పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అంతేకాదు.. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు ట్రక్కు డ్రైవర్లతో పోలీసులు, అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
అధికారుల స్పష్టమైన హామీతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన విరమించారు. తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి కూడా చెప్పారు. కానీ రేపు ఎల్లుండి పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్ని బంక్‌లో పెట్రోల్ అందుబాటులో ఉంటుదన్నారు. గాబరపడి ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయొద్దని మనవి చేశారు.