ఆ సీన్ చూశాక.. కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్: మంత్రి ఉత్తమ్ ఫైర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ మరోసారి విమర్శలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు

Update: 2024-06-07 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ మరోసారి విమర్శలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చిన రిజల్ట్ సీన్ చూశాక.. ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ నివేదిక ఆధారంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను తొలగించామని తెలిపారు. జ్యుడిషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుఫరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లలో పోశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పిందని మండిపడ్డారు. వర్షకాలం వస్తోన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించని విషయం తెలిసిందే. దీనిపైనే తాజాగా మంత్రి సెటైర్ వేశారు. 

Tags:    

Similar News