Minister Tummala:‘పత్తి రైతులకు గుడ్ న్యూస్’.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

రాష్ట్రంలో పత్తి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి(Minister of Agriculture), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-10-25 14:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పత్తి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి(Minister of Agriculture), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) గుడ్ న్యూస్ చెప్పారు. పత్తిని అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరుగొద్దని ‘వాట్సాప్’ సేవలు ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. పత్తి రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. వాట్సప్ నెంబర్(Whatsapp Number) 8897281111 ద్వారా పత్తి అమ్మకం(Cotton Sale), కొనుగోలుకు సంబంధించిన వివరాలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ(Department of Agricultural Marketing) సిద్ధమైంది. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఈ సేవలను ప్రారంభించింది.

పత్తి కొనుగోళ్లు(Cotton purchase), అమ్మకం(sale), అర్హత(eligibility), తదితర వివరాలు(details), చెల్లింపు స్థితి(payment status), సీసీఐ సెంటర్లలో(CCI centers) వేచి ఉండే సమయం వంటి వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సాప్‌ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులకు తెలిపారు. పింజ రకము(బీబీ మోడ్)క్వింటాకు రూ.7521, (పింజ పొడవు 29.5 నుంచి 30.5(మి. మీ), మైక్రోనీర్ విలువ 3.5 నుంచి 4.3) గా, పింజ రకము (బీబీ ఎస్పీ ఎల్) క్వింటాకు రూ.7471( పింజ పొడువు (మి. మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8) గా, పింజ రకము (మెక్) క్వింటాకు రూ.7421 (పింజ పొడువు (మి. మీ) 27.05 నుంచి 28.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.7) గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు.

పత్తిలో తేమ 12% మించకుండా ఉండాలని, 8% నుంచి 12% మద్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుందని మంత్రి తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుందని, రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తుందని, రైతులంతా మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్సాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసాలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరారు. రైతులు ఎటువంటి ఫిర్యాదులు చేసినా మార్కెటింగ్ శాఖ సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News