Tummala: మీ వల్ల నేను నిందలు పడాల్సి వస్తుంది.. అధికారుల తీరుపై మంత్రి తుమ్మల ఫైర్

అధికారుల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-25 08:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకే ఉపయోగపడాలని, పచ్చదనం కోసం గత ప్రభుత్వ హయాంలో పిచ్చిమొక్కలు నాటారని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని మళ్లీ ఇప్పుడు నరికేస్తున్నారని ఆ మొక్కలను రూ.10 కొనుగోలు చేసి రూ.100 బిల్లులు తీసుకున్నారని మండిపడ్డారు. బుధవారం ఖమ్మంలో పర్యటించిన మంత్రి.. ఖమ్మంను పాలించిన గత పాలకులు, అధికారులపై మంత్రి తుమ్మలు మండిపడ్డారు. కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులతో ఖమ్మంను అతలాకుతలం చేశారన్నారు. రోడ్లు ఆక్రమించి షెడ్లు, ఇళ్లు, కిరణాలు నిర్మిస్తుంటే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ఆ ఆక్రమణల వల్ల ఇపుడు ఇండ్లు మునుగుతుంటే నేను కూల్చాలా అన్నారు. మీ పని మీరు చేస్తే నేను ఇవాళ నేనీ నింద మోయను కదా? అన్నారు.

ఎవ్వరినీ వదనలు:

కబ్జాలు, ఆక్రమణలు చేసిన ఏ ఒక్కరినీ వదలనని మంత్రి హెచ్చరించారు. కార్పొరేటర్లు కూర్చుని కాలువలు వెడల్పు, అక్రమ కట్టడాలు కూల్చమంటే కూలుస్తామని వద్దంటే వదిలేస్తామన్నారు. నాయకుడు చిత్తశుద్ధితో పని చేయాలే తప్ప వ్యక్తిగతం కోసం పని చేయొద్దని సూచించారు. మీరు అక్రమంగా లాక్కున్న స్థలాలను బరాబర్ వెనక్కి తీసుకుంటామని వెలుగుమట్ల లో ఎవరో కబ్జా చేశారని తెలిసిందన్నారు. రేపే అధికారులను పంపించి హద్దులు పెట్టిస్తానన్నారు. వరదల్లో మునిగిన భాదితులకు ఇళ్ళు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. చెరువులో ఇండ్లు కట్టుకుని మునిగిపోతున్నాయంటూ నేను ఒప్పుకోనన్నారు.


Similar News