కీలక భేటీకి నిమిషాల ముందు రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ.. ఏం కోరారంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. గత పదేండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న

Update: 2024-07-06 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. గత పదేండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ముఖాముఖీ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ లేఖ రాశారు. ఈ లేఖలో మంత్రి తుమ్మల రేవంత్‌కు కీలక విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముణ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అంశంపై చర్చించాలని కోరారు. ఇదిలా ఉంటే, రేవంత్, చంద్రబాబుల సమావేశం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డులో తెలంగాణ నుండి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ టాపిక్‌పై చంద్రబాబుతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటుగా ఈ భేటీలో దేవదాయ భూములకు సంబంధించిన అంశాలపై చర్చించాలన్నారు. టీటీడీ నుండి తెలంగాణలోని ఆలయాలకు రూ.10 లక్షల ఫండ్స్ రావాలని గుర్తు చేశారు. మరీ మంత్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని రేవంత్ ఈ అంశాలపై డిస్కస్ చేస్తారో లేదో చూడాలి.


Similar News