3.23 కేజీ‌ల గంజాయి పట్టివేత.. ముగ్గురు నిందితులు అరెస్ట్

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-10-05 05:41 GMT

దిశ, జూబ్లీహిల్స్: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం, వరంగల్, చిట్యాల తదితర ప్రాంతాలకు చెందిన దుగ్యాల రాజ్ కుమార్ (27), పథ వర్షిత్ (22) ,గుండెపూడి సూర్య అజయ్ (23), తుమ్మా భానుతేజా రెడ్డి (25), దండి దీపక్ (23), ఐదుగురు స్నేహితులు కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని సీబీఐ కాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లా సమాచారం అందిందని తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జూబ్లీహిల్స్ ఎక్సైజ్ అధికారులు సీఐ వాసుదేవరావు, ఎస్సై బ్రహ్మచారి బృందం హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 3.23 కేజీల ఎండు గంజాయి గంజాయి లభ్యమైంది. దుగ్యాల రాజ్ కుమార్, పథ వర్షిత్, గుండెపూడి సూర్య అజయ్ అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు తుమ్మా భానుతేజా‌రెడ్డి, దండి దీపక్ పరారీలో ఉన్నారని వారు తెలిపారు. అనంతరం నిందితుల నుంచి రెండు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.


Similar News