ఎన్నికల వేళ పాదయాత్రకు సిద్దమైన మంత్రి తలసాని
ఎన్నికల వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన సనత్‌నగర్‌లో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అమావాస్య ముగిసిన తర్వాత పాదయాత్రకు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించనుండగా.. ఈ భేటీలో పాదయాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.
పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనేలా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వెయ్యి మంది తక్కువ కాకుండా పాదయాత్రకు పాల్గొనేలా కార్యాచరణ చేపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గరించి ప్రజలకు తలసాని వివరించనున్నార.