చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సభ మొత్తం 45 గంటల 32 నిమిషాలు జరిగిందని.. 59 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారని వెల్లడించారు. జీరో అవర్‌లో 64 మంది సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమావేశాల్లో మూడు బిల్లులు ఆమోదించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించినట్లు కులగణన తీర్మానాన్ని సభ ఆమోదించిందని.. దీంతో చరిత్రలో నిలిచే ఘట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బలహీనవర్గాలకు అన్ని విధాల న్యాయం చేసేందుకు కులగణన చేయాలని నిర్ణయించామన్నారు.