తమిళ హీరోకి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి సీతక్క

ప్రముఖ తమిళ నటుడు మాధవన్‌కి ట్విట్టర్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క థ్యాంక్స్ చెప్పారు.

Update: 2024-08-21 16:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ తమిళ నటుడు మాధవన్‌కి ట్విట్టర్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క థ్యాంక్స్ చెప్పారు. అమ్మాయిలు, మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన టీ-సేఫ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఆయనకు సీతక్క కృతజ్ఞతలు చెప్పారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో కాకుండా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీ-సేఫ్ పని చేస్తోంది.

మహిళలకు ఎంతో ఉపయోగకరమైన యాప్‌ అని అన్నారు. కోల్‌కత్తా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టీ-సేఫ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. టీ-సేఫ్ యాపును తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఇతర రాష్ట్రాలకు టీ-సేఫ్ యాప్ ఆదర్శంగా మారటం, ప్రముఖ హీరో మాధవన్ తన ట్విట్టర్ అకౌంట్లో టీ-సేఫ్ వీడియోను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్‌ను వినియోగించాలనీ సూచించారు. మరింతగా ఈ యాప్‌ను వినియోగంలోకి తెచ్చేలా విస్తృతంగా ప్రచారం చేయాల‌ని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News