బ్రేకింగ్: మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కు ప్రమాదం
మంత్రి సత్యవతి రాథోడ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ములుగు జిల్లాలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆమె
దిశ, వెబ్‌డెస్క్: శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ములుగు జిల్లాలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆమె కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఓ బొలెరో వాహనం అదుపు తప్పి మంత్రి కాన్యాయ్‌లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని పస్రా- తాడ్వాయి మధ్యలో చోటు చేసుకుంది. ఇక, ఈ ప్రమాదంలో మంత్రి సత్యవతి రాథోడ్‌కు ప్రమాదం తప్పడంతో ఆమె సిబ్బంది, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.