త్వరలో గురుకులాలకు సొంత భవనాలు.. జెఈఈ మెయిన్స్‌పై మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

ఐఐటీ, ఎన్ఐటీలో ప్రవేశం కోసం 2023 -24లో నిర్వహించిన జెఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించడం హర్షనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Update: 2024-04-25 13:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐఐటీ, ఎన్ఐటీలో ప్రవేశం కోసం 2023 -24లో నిర్వహించిన జెఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించడం హర్షనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. జెఈఈ 28 మంది అమ్మాయిలు అర్హత సాధించగా ఆరుగురు విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని తెలిపారు. అబ్బాయిలు 44 మంది అర్హత సాధించారని, అందులో 90 శాతంకు పైగా మార్కులు 8 విద్యార్థులు సాధించారన్నారు. మరో 21 మంది అబ్బాయిలు 80 శాతానికి పైగా మార్కులు పొందారన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖకు తన అభినందనలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం మరింత మంది అర్హత సాధించాలని ఆకాంక్షించారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెస్ చార్జీలు చెల్లించడానికి గ్రీన్ చానెల్ నీ ఏర్పాటు చేసిందన్నారు. త్వరలోనే గురుకుల పాఠశాలలకు సొంత భావనలు నిర్మించుకుంటామన్నారు. అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తూ, మంచి ర్యాంక్ లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..