Minister Ponnam: గాడ్సేను ప్రేమించే వారికి బాపూ ఘాట్ అభివృద్ధి పట్టదు.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్

గాడ్సేను ప్రేమించే బీజేపీ (BJP) నేతలు బాపూ ఘాట్‌ (Bapu Ghat)ను అభివృద్ధి చేయలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-17 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: గాడ్సేను ప్రేమించే బీజేపీ (BJP) నేతలు బాపూ ఘాట్‌ (Bapu Ghat)ను అభివృద్ధి చేయలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళణ పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌ (Musi Renaissance Project)పై బీజేపీ నేతలు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరినీ బలవంతంగా ఇళ్ల నుంచి తరలించబోవడం తెలిపారు.

ప్రజలను ఒప్పించి, మెప్పించిన తరువాతే మూసీ పునరుజ్జీవానికి (Musi Renaissance) శ్రీకారం చుడతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కేవలం సర్వే మాత్రమే కొనసాగిందని అన్నారు. PPP మోడ్‌లో మూసీ పునరుజ్జీవం జరగబోతోందని పేర్కొన్నారు. నిత్యం హైదరాబాద్ (Hyderabad) గురించి మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) నగరానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గాడ్సే (Godsey)ను ప్రేమించే బీజేపీ (BJP) నేతలు బాబూ ఘాట్‌ (Bapu Ghat)ను అభివృద్ధి చేయరని చురకలంటించారు. బస్తీ నిద్రలు చేసిన తరువాతైనా బీజేపీ (BJP) నేతలు ప్రజల ముందు వాస్తవాలు మాట్లాడాలని ఫైర్ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో (Musi Catchment Areas) ఇళ్ల కూల్చివేతపై ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.  

Tags:    

Similar News