Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ చార్జ్ షీట్‌లపై స్పందించిన మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీఆర్ఎస్, బీజేపీలు చార్జ్‌షీట్‌లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-08 07:31 GMT
Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ చార్జ్ షీట్‌లపై స్పందించిన మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) ఏడాది పాలనపై (BRS charge sheet) బీఆర్ఎస్, బీజేపీలు(BJP) చార్జ్‌షీట్‌లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇవాళ స్పందించారు. ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్‌గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని, వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చార్జిషీట్ పార్టీలు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్‌గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ దురదృష్టకరం ఏంటి అంటే ఏడాది కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన చార్జిషీట్ ఫైల్ చేసిన బాగుంటుండే అని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుందని, పిల్లి శాపనార్థాలు పెట్టారని, ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారని తెలిపారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన చార్జిషీట్ అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. చార్జిషీట్ అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News