ఎందుకు నామూషీగా ఫీలవుతున్నారో తెలియడం లేదు.. మండలిలో మంత్రి పొన్నం ఆవేదన

తెలంగాణ శాసన మండలి(Telangana Legislative Council)లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-13 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన మండలి(Telangana Legislative Council)లో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని గతంలో విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు(Government School) అద్భుతమైన భవనాలు ఉండి, ఎకరాల్లో స్థలాలు ఉండి, ఉపాధ్యాయులు ఉన్నా.. విద్యార్థులు లేక వెలవెల బోతున్నాయని ఆవేదన చెందారు. ‘మా దగ్గర చిగురు మామిడి మండలం నవాబ్ పేట అనే గ్రామంలో 50 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ గ్రామానికి 10 స్కూల్ బస్సులు వస్తున్నాయి’ అని అన్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు ఎందుకు నామూషీగా ఫీలవుతున్నారో తెలియడం లేదని అన్నారు.

గతంలో కరీంనగర్‌(Karimnagar)లో నాలుగు హైస్కూల్స్ ఉండేవి.. ఇప్పుడు మరికొన్ని పెరిగాయి.. ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది.. కానీ విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగడం లేదని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది, ప్రయివేట్ పాఠశాలల్లో ఎంతమంది చదువుతున్నారో వివరాలు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. త్వరలోనే ఆయనకు పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తామని ప్రకటించారు.

విద్యా వ్యవస్థ పట్ల అందరిలో మార్పు రావాలి.. కేరళ రాష్ట్రం లాగా తెలంగాణ మారాలి.. అప్పుడే వ్యవస్థలోనూ మార్పులు చూడగలుగుతామని అన్నారు. దీనిపై ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పలు సూచనలు చేశారని తెలిపారు. రాబోయే కాలంలో విద్య వ్యవస్థకు సంబంధించి అందరి ఆమోదయోగ్యమైన ఎడ్యుకేషన్ సిస్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్లాలని అన్నారు.

Tags:    

Similar News