సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. కారణమిదే!
మాజీ సీఎం కేసీఆర్ మీద కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ మీద కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సీఎంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదుచేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫిల్మ్‌నగర్ పీఎస్‌లోనూ ఫిర్యాదు..
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై ఫిల్మ్ నగర్ పీఎస్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ ఎమ్మెల్యే, రేవంత్‌రెడ్డి కలిసి ఏమైనా హత్య చేయాలని కుట్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలను ప్రశ్నించినందుకా? మార్చురీకి పోయేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇచ్చిపీసీసీ అధ్యక్షుడి పదవిని కొన్నారని.. సాక్షాత్తు తోటి మంత్రి కోమటిరెడ్డినే అంటున్నారని పేర్కొన్నారు. హంతక భాషను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై మాట్లాడిన భాషపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.