KTR: ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: ప్రభుత్వంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

తెలంగాణ (Telangana) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

Update: 2025-03-15 04:30 GMT
KTR: ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: ప్రభుత్వంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar)పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సభ పున:ప్రారంభం కానుండటంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య రాష్ట్ర అప్పులుపై సభ దద్దరిల్లే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోని వచ్చిన 15 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం (State Government) రూ.లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిందని మీడియాలో వార్తలు వస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఆర్థిక పరిస్థితి మాకెందుకు తెలియదు.. హామీలన్నీ అమలు చేస్తామన్నారంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతామంటూ కాంగ్రెస్ (Congress) ప్రగల్భాలు పలికిందని ధ్వజమెత్తారు. గత 15 నెలల పాలనలో ఊదు గాలింది లేదు.. పీరు లేసింది లేదని సెటైర్లు వేశారు. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్షా 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress Government) అధికారికంగా ఒప్పుకుందని అన్నారు. కానీ, రాష్ట్రంలో అన్నదాతలకు రుణమాపీ కాలేదని, రైతు భరోసా రాలేదని, రైతు భీమా ప్రీమియం కట్టలేదని, సాగు నీళ్లు రాలేదని, పంటల కొనగోళ్లు జరగడం లేదని, రూ.500 క్వింటాళ్ల ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

కేసీఆర్ కిట్ (KCR Kit), న్యూట్రిషన్ కిట్ (Nutrition Kit) మాయమయ్యాయని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాసపత్రుల్లో మందులు లేవని, వరంగల్ (Warangal) దవాఖాన, టిమ్స్ (TIMS) నిర్మాణాలు ఎక్కడ వేసిన గొండడి అక్కడే అన్న చందంగా మారాయని ఆక్షేపించారు. కాళేశ్వరానికి మరమ్మతు చేయకుండా.. రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Rangareddy) పనులు పడావు పెట్టారని.. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందక, విషాహారం తిని విద్యార్థులు ప్రాణాలు పోతున్నాయని కామెంట్ చేశారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు తెచ్చిన అప్పులను 20 శాతం కమీషన్లు దండుకుని బిల్లులు చెల్లిస్తున్నాని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అన్నారు. రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత, ప్రజలు సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ 420 హామీలను చూసి మోసపోయాయని తెలిపారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన.. జాగో తెలంగాణ జాగో! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  

READ MORE ...

Formula E Race: మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-రేస్‌ కేసు.. వారికి మరోసారి నోటీసులు ఇచ్చే చాన్స్


Tags:    

Similar News