Ponnam: కుటుంబ సర్వేలో సమాచారం ఇవ్వకపోతే మీకే ఇబ్బంది: బీసీ కమిషన్‌తో మంత్రి పొన్నం
కుటుంబ సర్వేలో సమాచారాన్ని ఇవ్వని వారు ఉంటే వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: పట్టణ ప్రాంతంలో సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారస్తులు వివిధ రంగాల వారు ఇంకా సమాచారాన్ని ఇవ్వని వారు ఉంటే వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. తాజాగా సెక్రటేరియట్‌లో (BC Commission) బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయ ప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, భాగ్య లక్ష్మితో మంత్రి సమావేశం నిర్వహించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తాజా పరిస్థితి పై చర్చలు జరిపారు. సమగ్ర ఇంటింటి సర్వేలో ఇంకా ఎవరైనా సమాచారం ఇవ్వని వారు సమాచారం సేకరించేలా కుల సంఘాలు చొరవ తీసుకోవాలన్నారు. కులాల వారీగా సంఖ్య తెలియకపోతే వాళ్లకు రావాల్సిన పథకాలు రిజర్వేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.
(family survey) ఇంటింటి కుటుంబ కుల సర్వేలో పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములై సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు. పట్టణ ప్రాంతంలో ఇప్పటివరకు కుల సర్వేలో సమాచారాన్ని ఇవ్వలేదో.. తప్పకుండా అన్ని కులాలకు సంబంధించిన సంఖ్య వారి బలం ప్రభుత్వ పథకాలు వారికి న్యాయబద్ధంగా అందాలంటే పూర్తి సమాచారం ఉండాలి కాబట్టి మీ ఇంటికి సమాచార సేకరణ అధికారి రాకపోయి ఉంటే వారిని పిలుచుకొని సమాచారాన్ని ఇవ్వాలని వెల్లడించారు. ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకత్వం వహించే ప్రజా ప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్‌లు సమాజాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వారు సర్వేలో భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రభుత్వం కూడా సమాచార సేకరణ ద్వారానే నూతన పథకాలు ఇవ్వాలనుకుంటుందని తెలిపారు. వారికి సమాచారం లేకపోతే భవిష్యత్‌లో పథకాలకు కూడా ఇబ్బంది అవుతాదని, ప్రభుత్వ ఉద్యోగులు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. కుల సర్వేలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించారు.