రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణలో కొన్ని ఏండ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురు

Update: 2024-06-19 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొన్ని ఏండ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొత్త కార్డుల జారీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజావాణీ కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, మూడేళ్లలోనే తన సొంత నియోజకవర్గం పాలేరులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల నుండి రైతులకు రుణమాఫీ ప్రక్రియ చేస్తామని తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పెన్షన్లు అందిస్తామన్నారు. 

Tags:    

Similar News