కలెక్టర్‌ను తిట్టిన అంశంపై మంత్రి పొంగులేటి వివరణ.. MLC కవితకు కౌంటర్
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy)ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అందరి ముందే తిట్టటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy)ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అందరి ముందే తిట్టటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జనవరి 24న కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్(Union Minister Manohar Lal Kattar)తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ సెన్స్ ఉందా? అని అందరి ముందే కలెక్టర్ పమేలా సత్పతిని తిట్టారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలు స్పందించి పొంగులేటిపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ హయాంలో అధికారులకు ఇచ్చే గౌరవం ఇది.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. కరీంనగర్ ఘటన(Karimnagar incident)పై మంత్రి పొంగులేటి వివరణ ఇచ్చారు. కలెక్టర్ ఘటనను అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ‘నేనేంటో నాకు తెలుసు.. నేనెక్కడా తప్పు చేయలేదు. ఎవరెవరో ఏదేదో అంటే నేను పట్టించుకోను. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు’ అని కొట్టిపారేశారు. కాగా, కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ పాల్గొన్న సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.