Minister Ponguleti : పదేళ్ల పాలనలో చుక్క నీరు ఇవ్వలేదు.. రుణమాఫీ సభలో మంత్రి పొంగులేటి ఫైర్ స్పీచ్

ఖమ్మంలో జరిగిన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-15 12:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో జరిగిన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకు తేవాలని తపనతో ప్రాజెక్టులు చేపట్టారన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ సీఎం పదేళ్ల పాలనలో చుక్క నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రాజెక్టు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో.. అదే ప్రాజెక్టును కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రారంభించడం మనందరికీ సంతోషదాయకమన్నారు.

రైతును రాజును చేయాలని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మాట ఇచ్చారో తెలంగాణలో మార్పు రావాలని.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత ఆ నాటి ప్రభుత్వం మన నెత్తిన రూ.7 లక్షల 18వేల కోట్లు అప్పు భారాన్ని పెట్టి పోయిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతును రాజును చేయాలని సీఎం రేవంత్ నిర్ణయంతో రూ.31 వేల కోట్లతో రెండు లక్షల రుణమాఫీ చేయాలని కింద మీద పడి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను యుద్ద ప్రాతిపదికన మన ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చి ప్రజలకు అండగా ఉంటాము.. మీరు మాకు అండగా ఉంటారని తెలిపారు.

Tags:    

Similar News