Minister Ponguleti: మూసీ పునరుజ్జీవానికి చంగ్‌చియాన్ నది స్ఫూర్తి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
నగరంలో కాలుష్య కాసారంగా మారిన మూసీ నది పునరుజ్జీవానికి చంగ్‌చియాన్ నది గొప్ప స్ఫూర్తి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో కాలుష్య కాసారంగా మారిన మూసీ నది పునరుజ్జీవానికి చంగ్‌చియాన్ నది గొప్ప స్ఫూర్తి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మూసీ పునరుజ్జీవంలో సియోల్ మోడల్ అమలుపై అధ్యయనం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ మంత్రి పొంగులేటి సియోల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవానికి చంగ్‌చియాన్ నది గొప్ప స్ఫూర్తి అని అన్నారు. ప్రక్షాళన తరువాత ప్రజలకు మూసీ నది అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. పునరుజ్జీవం తరువాత మూసీ కూడా చంగ్‌చియాన్ నది లాగా అందంగా మారడం ఖాయమని పేర్కొన్నారు.
సియోల్‌లో 2 వేల సంత్సరానికి ముందుకు.. ఆ తరువాత పరిస్థితులపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. వైశాల్యం, జనాభా పరంగా సియోల్, హైదరాబాద్ ఓకే విస్తీ్ర్ణంలో ఉన్నాయని.. అలాంటప్పుడు హైదరాబాద్ సియోల్‌తో పోటీ పడటంలో తప్పేముందని అన్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా మూసీ పరివాహక ప్రాంతం హైదరాబాద్ మహానగరాన్ని పట్టి పీడిస్తోందని పేర్కొన్నారు. వేల కుటుంబాలు ఆ మురికి కూపంలో నివసిస్తూ.. ఇబ్బందులు పడుతున్నారని వారందరి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. సియోల్‌లో నదుల సుందరీకరణ విషయంలో నిర్వాసితులైన ప్రజలకు ఇక్కడి ప్రభుత్వం ఎలా వారికి ఆదుకుందనే విషయంపై ఇన్‌డెప్త్‌గా స్టడీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు.