చాలామందికి అర్హత ఉంది.. ఎన్నికల వేళ సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో

Update: 2023-10-21 16:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో సీఎం అయ్యే అర్హత ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని, తనకు అలాంటి కోరికలు లేవని వ్యాఖ్యానించారు. ముమ్మాటికీ తెలంగాణ సీఎం కేసీఆరే అని తేల్చేశారు. ప్రతిపక్షాలను తన మీద ప్రేమ ఉందని, అందుకే తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని సెటైర్లు పేల్చారు. రాహుల్ గాంధీకి వేరే ధ్యాస లేదని, పెళ్లి చేసుకోరని కేటీఆర్ అన్నారు. వచ్చే లోక‌సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయన్నారు. అప్పుడే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెబుతామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తమ మెడపై కత్తి పెట్టి శత్రువులా చూస్తోందని, తమకు వచ్చే నిధులను కేంద్రం ఆపుతోందని కేటీఆర్ విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని ఆర్ధికంగా దెబ్బతీసే ప్రయత్నం కేంద్రం చేస్తోందని, తెలంగాణకు కరెంట్ కష్టాలు తెచ్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు.

Tags:    

Similar News